వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వాట్సాప్‌ను నిషేధించేలా కేందప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఒమన్‌ కుట్టన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వాట్సాప్ పై నిషేధం విధించాలని మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐటీ చట్టం– 2021 రూల్స్ ను పాటించడం లేదని తెలిపారు. ఈ పిల్ ను కేరళ హైకోర్టు 2021, జూన్ లో కొట్టివేసింది. దీంతో ఒమన్ కుట్టన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని పిటిషనర్ చేసిన వాదనలను సుప్రీం తిరస్కరించింది.