తరుణ్ తేజ్ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

తరుణ్ తేజ్ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు మరోసారి చుక్కెదురైంది.  దీపావళి సందర్భంగా తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని, 10 ఏళ్ల  జైలు శిక్షను నిలిపివేయాలని తేజ్ పాల్ దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం తోసిపుచ్చింది.

తేజ్‌పాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, దీపావళి పండుగ ను దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూర్ చేయాలని కోరారు అయితే గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ విజ్ఞప్తికి  ఆబ్జక్షన్ తెలిపారు. . ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం శిక్షను సస్పెండ్ చేయలేమని స్పష్టం చేసింది.

ఈ కేసు 2013 నాటిది. గోవాలో తెహల్కా మ్యాగజీన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తేజ్‌పాల్ తనకు జూనియర్ అయిన మహిళా సహోద్యోగిని హోటల్ లిఫ్ట్‌లో లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపణలతో అతడిపై కేసు నమోదు అయ్యింది. 

ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేసిన ఐదేళ్ల తర్వాత, బాంబే హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 6న ఆ తీర్పును తిరస్కరించింది. తేజ్ పాల్ ను  అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ALSO READ : ఫారెన్ బాస్ కోసం ఉద్యోగి డ్యాన్స్.. ఇదెక్కడి ఆఫీస్ కల్చరంటూ నెటిజన్లు ఫైర్!

ఆ తీర్పును సవాల్ చేస్తూ 62 ఏళ్ల తేజ్‌పాల్ ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు రాజకీయ కక్షతో పెట్టిందని ఆయన వాదిస్తున్నారు. అదే సమయంలో, శిక్షను మరింత పెంచాలని గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తేజ్‌పాల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.