
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు పై కూర్చోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపును ఈసందర్భంగా న్యాయవాదులు ప్రస్తావించారు.
ఈ కేసులోనే అన్నింటిని కలుపుతారా అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వాటిని ఈ కేసుతో కలిపి వినలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందుగా ప్లీడింగ్స్ పూర్తి కావాలని తెలిపింది.నాలుగు వారాలలో కౌంటర్, రెండు వారాలలో రిజైన్డర్ ఇవ్వాలని ఆదేశించింది. 8 వారాల తర్వాత కేసును లిస్ట్ చేయాలని తెలిపింది. నవంబర్ 16, 17 తేదీలలో కేసును లిస్ట్ చేయాలని పేర్కొంది.