కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారా..? కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారా..? కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ దుష్ప్రభావాల కారణంగా చనిపోయిన వారికి పరిహారంపై కేంద్రం స్పందించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దేశ ప్రజల్లో కొందరు టీకా పడకపోవడంతో దుష్ప్రభావాల కారణంగా చనిపోయారు. ఇలా చనిపోయిన వారి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం ఏదైనా పాలసీ చేసిందో.. లేదో చెప్పాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటిని అడిగింది.

కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన భర్త ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని, తనకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కేరళకు మిసెస్ సయ్యద్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకొచ్చిన సందర్భంలో ఎక్స్గ్రేషియాపై కేంద్రం స్పందించాలని ఆదేశించింది.

Also Read:-ఐడీబీఐ బ్యాంకులో 650 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..

కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుండెపోటు, క్యాన్సర్, నరాల వ్యాధులు వంటివి వస్తున్నాయని అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతిధులు ఆరోపించారు. ఇప్పటికే చాలామంది మృతి చెందారని, వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ ​తయారీ సంస్థ  నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంతో పాటు  వ్యాక్సిన్ ను ​ప్రమోట్​ చేసిన సెలబ్రెటీలు కూడా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.