పార్టీ ఫిరాయింపులపై అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ (శుక్రవారం, జనవరి 31) సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిగింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న సమాధానానికి.. ‘‘మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహా అసెంబ్లీ గడువు ముగిసే వరకా..’’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
పార్టీ ఫిరాయింపులపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి న్యాయవాది ముకుల్ రోహాత్గీ సమాధానంగా తెలంగాణ స్పీకర్ ను అడిగి నిర్ణయం చెబతామని తెలిపారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.