Supreme Court: మమతా ప్రభుత్వానికి షాక్..25వేల టీచర్ల నియామకాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court: మమతా ప్రభుత్వానికి షాక్..25వేల టీచర్ల నియామకాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి  ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన టీచర్ల నియామకాల రద్దు చేస్తూ కోల్ కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. 

2016లో చేపట్టిన 25వేల టీచర్లు,బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల నియమాక ప్రక్రియ చట్టవిరుద్దంగా ఉందని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

►ALSO READ | Trump Tariffs: దయచూపించిన ట్రంప్.. ఈ 50 వస్తువులపై 'NO' టారిఫ్స్.. ఫుల్ లిస్ట్

మూడు నెలల్లో కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది.  కొత్త నియామక ప్రక్రియలో ఉత్తీర్ణలైనవారు 2016లోని నియామకం అయినప్పటినుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణులు కాకపోతే జీతం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పోస్టింగ్ లో ఉన్న దివ్యాంగులకు కోర్టు సడలింపు ఇచ్చింది. వారిని ఉద్యోగంలో కొనసాగించాలని పేర్కొంది. 

 పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్ల నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్ మెంట్లను రద్దు చేసింది. ఆ టీచర్లంతా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్యాన్సర్ తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.