ఎలక్ట్రోరల్ బాండ్లు.. వీటినే ఈ బాండ్లు అని కూడా అంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది.. ఈ.. ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించటం అనే పథకాన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది. దేశంలోని రాజకీయ పార్టీలకు చాలా మంది నిధులు ఇస్తుంటారు.. అలాంటి నిధులకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు.. అంతేకాదు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చందాలు వస్తుంటాయి.
ఈ స్కీంను రద్దు చేయాలని.. రాజ్యాంగ విరుద్ధం అని కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ జయ ఠాకూర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), NGO అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సుదీర్ఘంగా సాగిన విచారణలో.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇది చట్టాలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే కాదు. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదన్న కోర్టు.. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది ధర్మాసనం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై పారదర్శకత ఉండాలనేది ఈ పథకం ఉద్దేశం. అయితే ఇది మరింత అవినీతిని, బ్లాక్ మనీని ప్రోత్సహించేదిగా ఉందని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read: మణికొండలో చెట్ల కొట్టివేతపై ..కౌంటర్ వేయండి
ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు, కొనుగోలు సమయంలో చెల్లించే డబ్బులకు లెక్కలు చెప్పాల్సిన అసవరం లేకపోవటం వంటి వెసలుబాట్లు ఉన్నాయి. ఈ విధానంపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019 నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసిన.. ఆ బాండ్లు స్వీకరించిన రాజకీయ పార్టీల వివరాలు అన్నీ సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.