- బ్యాన్ అమలు తీరుపై అఫిడవిట్ ఇవ్వండి
- ఢిల్లీ సర్కార్, పోలీసులకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: దీపావళి కారణంగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఢిల్లీలో ఫైర్‌క్రాకర్స్ కాల్చడంపై ఉన్న బ్యాన్ ఎందుకు అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రజలు ఫైర్‌క్రాకర్స్ కాల్చుతుంటే అవగాహన కల్పించకుండా.. చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నరని మండిపడింది. ఈ ఏడాది ఫైర్‌క్రాకర్స్ కాల్చడంపై ఉన్న నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ సర్కారుకు, పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది.
అలాగే.. వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు కూడా అఫిడవిట్ లో పొందుపరచాలని ఆదేశించింది." టపాసులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని వార్తలు వచ్చాయి. ఫైర్‌క్రాకర్స్ అమ్మకాలు, తయారీ యథేచ్ఛగా జరిగాయి. ప్రజలు నిషేధాన్ని ఉల్లంఘించి పటాకులు కాల్చుతుంటే ఏం చేస్తున్నారు? పంట వ్యర్థాల కాల్చివేత, పొల్యూషన్ పై ప్రజల్లో అవగాహన పెంచడం, ఫైర్‌క్రాకర్స్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, ఫైర్‌క్రాకర్స్ పై కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తీసుకున్న చర్యల వివరాలను వారంలోగా సమర్పించండి" అంటూ నోటీసులు ఇచ్చింది.2025 నాటి దీపావళికైనా పొల్యూషన్ పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో అఫిడవిట్ ద్వారానే తెలియజేయాలని స్పష్టం చేసింది. విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.