ట్రంప్ పోటీపై మేం నిర్ణయం తీసుకుంటం..అమెరికా సుప్రీంకోర్టు కామెంట్​

వాషింగ్టన్ : 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందు కు ప్రయత్నించారన్న కారణంతో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను 2024 ప్రెసిడెన్షియల్ ఎన్నికలకు దూరంగా ఉంచాలా? వద్దా? అన్నది తాము నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభిస్తామ ని తెలిపింది. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌‌పై జరిగిన దాడిలో ట్రంప్ హస్తం ఉందంటూ నమోదైన ఓ కేసును కొలరాడో నుంచి స్వీకరించేందుకు కోర్టు అంగీకరించింది.

 రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌‌లో ట్రంప్ ఉండరాదంటూ కొలరాడో సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును దేశ సుప్రీంకోర్టులో ట్రంప్ సవాలు చేశారు. ఇవే ఆరోపణలతో మైన్‌‌ రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్‌‌ ప్రైమరీ బ్యాలెట్‌‌ నుంచి ట్రంప్ పేరును తొలగించారు.