![దిశా ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. ప్రకటనపై ఉత్కంఠ](https://static.v6velugu.com/uploads/2022/05/Supreme-Court-to-hear-Disha-encounter-2022,-May-20th_ziDfW02BEk.jpg)
భారతదేశ వ్యాప్తంగా దిశ ఎన్ కౌంటర్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ ఘటనపై ఏర్పాటైన కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేయనుంది. 2022, మే 20వ తేదీన శుక్రవారం ఎలాంటి ప్రకటన చేయనుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీం విచారణ చేపడుతోంది. సిర్పూర్ కర్ కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీం.
దాదాపు మూడు సంవత్సరాల పాటు కమిషన్ విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు వేదికగా విచారణ జరిగింది. ఇటీవలే విచారణ పూర్తి చేసిన కమిషన్.. నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఫేక్ ఎన్ కౌంటర్ ? ఎన్ కౌంటర్ అనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది. అయితే.. కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని పోలీసులు కోరారు. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ శుక్రవారం జరిగే విచారణకు హాజరు కానున్నారు.
- 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు.
- దారుణంగా మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు.
- ఈ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
- షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం.
- దిశ హత్యాచార సంఘటనలో 2019, డిసెంబర్ 6న ఛటాన్‌పల్లి వద్ద నిందితులైన నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్, గుడిగండ్లకు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
మరిన్ని వార్తల కోసం : -
చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు