సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 (1) కు విరుద్ధంగా ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఎలక్షన్ కమిషన్ కు మార్చి 6లోపు సమర్పించాలని ఎస్బీఐ బ్యాంక్ ను కోర్టు ఆదేశించింది. అనుకున్న గడువుకు బ్యాంక్ బాండ్స్ వివరాలను వెల్లడించలేక పోయింది. SBI పోల్ ప్యానెల్‌కు డేటాను అందించడానికి జూన్ 30 వరకు కోర్టును గడువు పొడిగింపు కోరింది.
మార్చి 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించాలని ఎస్‌బీఐ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చెప్పిన టైంలో ఎలక్టోలర్ బాండ్స్ డేటా ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని ఎస్‌బిఐకి వ్యతిరేకంగా రెండు ఎన్జీఓలు బ్యాంక్ పై కోర్టు ధిక్కార చర్చలు తీసుకోవాలని పిటిషన్ వేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువు పెండిగింపు పిటిషన్ పై మార్చి 11న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
ALSO READ :- ఆస్పత్రిలో అన్నను పరామర్శించిన సీఎం రేవంత్రెడ్డి