పిటిషనర్లు, అడ్వకేట్లు ఇకపైన సుప్రీంకోర్టులో కేసులో ఫైలింగ్, లిస్టింగ్, ఇతర వివరాలకు సంబంధించిన అప్డేట్లలను వాట్సాప్ ద్వారా వ్యక్తిగత మెసేజ్ రూపంలో పొందవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రకటించారు. ఇలా కేసులకు సంబంధించిన అప్డేట్లు వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తి పంపడం వల్ల న్యాయవ్యవస్థపై మంచి ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయంతో వెబ్సైట్లో అందుబాటులో ఉండే అడ్వకేట్లు, కక్షిదారుల కేసుల ఫైలింగ్, ఉత్తర్వులు, తీర్పులు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా అందుతాయని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కాజ్లిస్టులను వాట్సాప్ ద్వారా పంపిస్తామన్నారు.