- ప్రజాధనం దోచుకుని స్కామ్ లేదంటరా?
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీం తీర్పు కేటీఆర్కు చెంపదెబ్బ లాంటిదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన ఏం చెప్తారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకుని కుంభకోణం లేదు.. లంబకోణం లేదంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఫైర్ అయ్యారు. ‘‘ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నం. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడ్తున్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం లాగా మేం ఎవరిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయలేదు. కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.