బిల్లులు ఆమోదిస్తారా.. మమ్మల్ని చూసుకోమంటారా?

  • తమిళనాడు గవర్నర్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎన్ రవి, సీఎం స్టాలిన్‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

చెన్నై: తమిళనాడులోని యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎన్‌‌ రవి, సీఎం స్టాలిన్‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని, లేదంటే తామే పరిష్కరించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. వీసీల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్‌‌‌‌ వద్దకు పంపింది. అయితే, గవర్నర్‌‌‌‌ను చాన్స్‌‌లర్‌‌‌‌గా మార్చడం, వీసీల నియమాకాల్లో తన అధికారాలను పరిమితం చేయడంపై రూపొందించిన బిల్లులును ఆమోదించేందుకు గవర్నర్‌‌‌‌ నిరాకరించారు.

దీంతో ఆయన వద్దే ఆ బిల్లులు ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉండిపోయాయి. మొత్తం 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌ వద్దకు పంపగా, వాటిలో ఒకటి మాత్రమే ఆయన ఆమోదించారు. ఏడు బిల్లులను నిలిపివేశారు. మిగిలిన రెండు బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గవర్నర్‌‌‌‌ చర్యలు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం అంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.