న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
రిటైర్డ్ సుప్రీం/హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని సుదర్శన్ న్యూస్ చానల్ఎడిటర్ సురేశ్ ఖండేరావు, సిట్ దర్యాప్తు చేయాలని హిందూసేన అధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ కోరారు. కోర్టు పర్యవేక్షణలో కమిటీని నియమించి దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు.