మీ భూములు మీ ఇష్టం..చెట్లు నరకొద్దు

మీ భూములు మీ ఇష్టం..చెట్లు నరకొద్దు
  •  మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా? అనేది అనవసరం 
  • అభివృద్ధి చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోండి
  • వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్నదే ప్రశ్న
  •  అక్కడి జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పండి
  • నాలుగు వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలన్న సుప్రీం కోర్టు
  •  కంచ గచ్చిబౌలి భూములపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
  •  తదుపరి విచారణ మే 15న.. అప్పటి వరకు స్టేటస్ కో

ఢిల్లీ: కంచగచ్చి భూముల కేసు విచారణ సందర్భంగా ఇవాళ  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ భూములు మీ ఇష్టం..చెట్లు నరకొద్దు   ‘ మీ భూములు మీ ఇష్టం..  మార్టిగేజ్ చేశారా..? అమ్ముకున్నారా..? అనేది  అనవసరం.  భూములు అభివృద్ధి చేసేందుకు పర్యావరణ చట్టం 1996 ప్రకారం అనుమతులు తీసుకున్నారా..? లేదా..? వందల ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్నది పాయింట్.. అక్కడి జంతు జాలాన్ని ఎలా రక్షిస్తారో చెప్పండి’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళ జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.  వందెకరాల్లో కొట్టేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని గవాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు  ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు. 

►ALSO READ | నీకు అత్తాకోడళ్ల సిన్మా చూపిస్తా..ఎర్రబెల్లికి యశస్విని రెడ్డి మాస్ వార్నింగ్

తాము వీడియోలు చూసి గందరగోళానికి గురయ్యామని, పర్యావరణ విషయంలో రాజీ పడే  ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ కామెంట్ చేశారు. తెలంగాణ లో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని  అమికస్ క్యూరీ ధర్మాసనానికి వివరించారు.  సెల్ఫ్ సర్టిఫికేషన్  చేసుకొని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారన,ఇ ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ అంశాలపై  స్పందించిన జస్టిస్ గవాయ్.. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, వాటి పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది.  జరిగిన  నష్టాన్ని ఎలా పూడ్చుతారన్న అంశంపై నాలుగు వారాల్లో  ప్రణాళికతో రావాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని సూచించింది. 
 
ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం