అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక  ఉత్తర్వులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత,  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక  ఉత్తర్వులు ఇచ్చింది.  2023 మే 25 వరకు రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.  

మే 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు  వెళ్లాలని సూచించింది. అదే రోజున విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును  సుప్రీం ఆదేశించింది.  దీంతో  అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మే 25 హైకోర్టులో విచారణ జరగనుంది.   

మరోవైపు తన తల్లి అనారోగ్యంగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు తనకు ఈ నెల 27 వరకు గడువు కావాలంటూ అవినాష్‌ రెడ్డి  మే 22  సోమవారం రోజున సీబీఐ అధికారులకు మరో లేఖ రాశారు.