హైదరాబాద్ సిటీ, వెలుగు: అప్పటికప్పుడు బుల్డోజర్ న్యాయం చేయడం సరికాదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు హైడ్రాకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభు త్వాలు వివిధ కేసుల్లోని నిందితుల ఇండ్లు, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయిస్తు న్నాయి. ఇలా అప్పటికప్పుడు బుల్డోజర్ ద్వా రా చేసే న్యాయం సరికాదని, ఇలాంటి కూల్చి వేతలు వెంటనే ఆపాలని సుప్రీంకోర్టు మంగ ళవారం ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పుపై రంగనాథ్ స్పందిస్తూ.. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తిం చవని తెలిపారు. యూపీ లోని నేరస్తులు, నిందితుల ఇండ్ల కూల్చివేత లకే అవి వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వా టిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందన్నారు. నేరస్తులు, నిందితుల ఆస్తుల జోలికి హైడ్రా వెళ్ళడం లేదన్నారు.