కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు

కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: బిల్లులను పెండింగ్ లో పెడుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కారణం లేకుండానే ఎనిమిది బిల్లులను ఇద్దరు గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ  కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆపుతున్నారని, ఆలస్యానికి గల కారణం తెలియజేయట్లేదని రెండు రాష్ట్రాలు కోర్టుకు తెలిపాయి. దాంతో  కేంద్ర హోంశాఖకు, గవర్నర్లకు సుంప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.