ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని మోసం ..వ్యక్తి అరెస్ట్

ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని మోసం ..వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్​ : ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని మోసం చేసిన సురభి శ్రీనివాస్ అనే వ్యక్తిని సికింద్రాబాద్​ మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. తనకు ముఖ్యమంత్రి, మంత్రులు సన్నిహితంగా ఉంటారని చెప్పి సురభి శ్రీనివాస్ రావు పలువురిని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బీజేపీ మహిళా మోర్చాకు చెందిన ఓ నేతకు సురభి శ్రీనివాస్ ఫోన్​ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని  మాయమాటలు చెప్పడంతో ఆమె మోండా మార్కెట్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీ మహిళా నేత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు సురభి శ్రీనివాస్ రావును అరెస్ట్ చేశారు. 

ఇదే తరహాలో అన్ని పార్టీలకు చెందిన నాయకుల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సేకరించి.. వారికి ఫోన్లు చేస్తూ, టికెట్లు ఇప్పిస్తానంటూ శ్రీనివాస రావు మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి పోలీసులు శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకున్నారు.