![ఫిబ్రవరి 8 నుంచి కట్టమైసమ్మ జాతర](https://static.v6velugu.com/uploads/2025/02/suraram-katta-mysammajatara-celebratons-start-on-februrary-8th_Wx0QXufCPt.jpg)
జీడిమెట్ల, వెలుగు: సూరారం శ్రీకట్టమైసమ్మ జాతర శనివారం నుంచి ప్రారంభం కానుంది. జాతరకు సిటీతోపాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ప్రధాన జాతర నిర్వహిస్తారు. సోమవారం రంగం జరుగుతుంది. బుధవారం అన్నసమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి.