కలర్​ఫుల్​ పొలిటికల్​ శారీలకు ఫుల్ డిమాండ్

శ్రీదేవి శారీ, సౌందర్య చీరలు,.. పెండ్లి సందడి మోడల్స్, రౌడీ అల్లుడు వెరైటీస్​.. అంటూ నైంటీస్​లో మూవీ థీమ్​తో రకరకాల చీరలు మార్కెట్​లో సందడి చేసేవి. లేటెస్ట్​గా సూపర్‌‌‌‌ డూపర్‌‌‌‌ హిట్‌‌ కొట్టిన ‘పుష్ప’ సినిమాతో మళ్లీ ఈ థీమ్​కు ప్రాణం పోశారు సూరత్​ శారీ మేకర్స్. మరోవైపు ఎలక్షన్​ సీజన్​ కావడంతో కలర్​ఫుల్​ పొలిటికల్​ శారీలు కూడా మార్కెట్​లోకి వచ్చాయి. ఈ చీరలకు జనాల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. మొత్తానికి సూరత్​ శారీ మేకర్స్​ మాత్రం చీరల తయారీలో తగ్గేదేలె అనిపిస్తున్నారు కదా!