
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. గాయం నుంచి కోలుకున్న స్నేహిత్ మెడల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.
హర్యానాలోని పంచకులలో జరిగిన ఈ టోర్నీ మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 3–0తో అనిర్బన్ ఘోష్ (ఆర్ఎస్‌పీబీ)ని ఓడించాడు. కానీ, సెమీఫైనల్లో తెలంగాణ ప్లేయర్ 2–4 తేడాతో పయాస్ జైన్ (ఢిల్లీ) చేతిలో ఓడి కాంస్యం పతకంతో తిరిగొచ్చాడు.