హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని చెప్పడానికి లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడమే నిదర్శనమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. అదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి ఎందుకు అన్ని నెలలు పట్టిందని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ పదేళ్ల కాలంలో బీద ప్రజల పొట్ట కొట్టిందని, దేశంలో అధిక రేట్లు పెంచుతూ ప్రజలను ఇబ్బంది పెట్టిన బీజేపీకి బీద ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. బీద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మూసీ ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని, ఇరువురు కలిసి కాంగ్రెస్ను ఎదురుకోవడమే వారిద్దరి టార్గెట్ అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఆరోపించారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఇంకా ఏమన్నారంటే..
* కాంగ్రెస్ పార్టీలో త్వరలో ఇంకొన్ని చేరికలు ఉంటాయి
* ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఉన్నారు
* మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు మంచి పద్ధతిలో సోషల్ మీడియాని వాడుకున్నాం
* బీఆర్ఎస్ అనైతికంగా డబ్బులు వెదజల్లి సోషల్ మీడియాతో తప్పులు ప్రచారం చేయిస్తుంది
* బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని దిగజారి వాడుతుంది
* సురేఖ, సీతక్క బలమైన నాయకులు కాబట్టే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు
* కాంగ్రెస్పై ప్రేమతోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు
* ఎమ్మెల్సీ మల్లన్నకు నా విజ్ఞప్తి..కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉంది
* బీసీ వ్యవహారం విషయంలో మల్లన్న బీసీల పక్షాన మాట్లాడారు
* బీసీలపై మాట్లాడితే అప్పుడే పార్టీ లైన్ తప్పారు అనడం సరికాదు