Ram Charan-Surekha Konidela: చరణ్పై తల్లి సురేఖ ప్రేమ చూశారా..పుట్టిన రోజుకు ముందే ఇచ్చేసింది

రామ్ చరణ్ (Ram Charan)మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి..అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకున్న గ్లోబల్ స్టార్ చరణ్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. రేపు మార్చి 27న జరిగే చరణ్ బర్త్ డే వేడుకలు ఒకరోజు ముందుగానే మొదలయ్యాయి. 

దేశవ్యాప్తంగా చరణ్ అభిమానులు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలనీ ఆలోచించుకునే లోపు..గ్రాండ్ గా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసింది రామ్ చరణ్ తల్లి సురేఖ. వివరాల్లోకి వెళితే..సురేఖ తన ముద్దుల కొడుకు చరణ్ పై ప్రేమతో అరుదైన వంటకాలతో ఇవాళ (మార్చి 26న) అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఆమె స్వయంగా 500 మందికి వంట చేసి ఈ కార్యక్రమం జరిపినట్లు ఇటీవలే ప్రారంభించిన అత్తమ్మాస్ కిచెన్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

రాంచరణ్ పుట్టిన రోజు ఒక రోజు ముందుగానే ఈ వేడుకలు అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయంలో మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ దేవాలయంలో పుష్కరోత్సవం జరుగుతున్న తరుణంలో ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన చిన్న జీయర్ స్వామి హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Also Read: తెలుగులో వెస్టర్న్‌ స్టైల్‌.. వెంకీ మామను ఆకాశానికెత్తేసిన సిద్దు

ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు హాజరయ్యారు. ఇక వారందరికీ చరణ తల్లి సురేఖ తన స్వహస్తాలతో వండిన రకరకాల  వంటలను తన ముద్దుల కోడలు ఉపాసన చేతుల మీదుగా వడ్డింప చేసి దేవిని ఆశీర్వాదం తీసుకున్నారు. కళాకారుల నృత్యాలు, పాటలతో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం రామ్ చరణ్ సొంతం చేసుకున్న క్రేజీ దృష్ట్యా..తన నుంచి వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో రానున్నాయి. కాగా రేపు పుట్టిన రోజు ఉండటంతో సుక్కు RC17, గేమ్ ఛేంజర్, బుచ్చి బాబు RC16 నుంచి అప్డేట్ రానున్నాయి. దీంతో ఫ్యాన్స్ మస్త్ ఖుషీలో ఉన్నారు.