మిస్ యూ కేపీ అన్నా : సురేఖ కుమార్తె సుప్రిత

మిస్ యూ కేపీ అన్నా : సురేఖ కుమార్తె సుప్రిత

కబాలి నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరిని సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అని కూడా పిలుస్తారు. నేడు ఫిబ్రవరి 2న కేపీ చౌదరి గోవాలో శవమై కనిపించాడు. కేపీ చౌదరి మరణవార్త ఆయన కుటుంబాన్ని, సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

అప్పట్లో కేపీ చౌదరికి పలు సినీ తారలతో సంబంధాలున్నాయని 'కేపీ చౌదరి' పేరు మోత మోగిపోయింది. పలువురు లేడీ యాక్టర్స్తో కేపీ చౌదరి చాలా సన్నిహితంగా ఉండే ఫొటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీతతో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉందని కూడా వినిపించింది. ఈ క్రమంలో సురేఖ వాణి డాటర్ సుప్రీత.. నిర్మాత కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ALSO READ | గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

"సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను అన్న. ఇక నుండి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న. నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా, దయచేసి వెనక్కి వచ్చేయ్ అన్న, మిస్ యు కెపి అన్న. నువ్వు ఎక్కడున్నా టైగర్ ఏ అంటావుగా, ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్ అన్న.. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. రిప్ అన్న" అంటూ సుప్రీత రాసుకొచ్చింది. అప్పట్లో జరిగిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేపీ చౌదరితో కలిసి ఫోటోలు దిగిన సురేఖవాణి సహా ఆమె కుమార్తె పేర్లు కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది తెలిసిందే.

ఇకపోతే, ఆర్థిక ఒత్తిళ్లు, సినీ పరిశ్రమలో ఎదురుదెబ్బలు కేపీ చౌదరి మృతికి కారణమని సమాచారం. 2023 డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం అతనికి మరింత బాధను కలిగించాయి.