ఒక్క డిజాస్టర్.. స్టార్డమ్ ఔట్.. టైర్2 హీరోతో సురేందర్ రెడ్డి

ఒక్క డిజాస్టర్  సురేందర్ రెడ్డి(Surender Reddy)  ఫ్యూచర్ నే మార్చేసింది. అంతకు ముందు.. చిరంజీవి(Chiranjeevi,), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సూరి.. ఇప్పుడు టైర్ 2 హీరోలతో సినిమాలు చేసే స్థాయికి వచ్చేశాడు. అఖిల్(Akhil)  హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీ సురేందర్ రెడ్డి స్టార్ డమ్ ను పాతాళానికి నెట్టేసింది. దాంతో ఈ డైరెక్టర్ కు ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు టైర్ 2 హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. అంతేకాదు.. ఒక మెగా హీరో సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఒకే కూడా చెప్పేశాడట.ఆ  హీరో మరెవరో కాదు.. పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej). ప్రస్తుతం ఈ హీరో శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy)  దర్శకత్వంలో ఆదికేశవ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ:గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సారి సూరి క్యూట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో రానున్నాడట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది అని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. మరి ఈ సినిమాతో అయినా సురేందర్ రెడ్డి తన పూర్వ వైభవాన్ని కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.