కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నిన్న (మార్చి 7న) చెన్నై అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం..అజిత్ కి బ్రెయిన్ సర్జరీ అయిందంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదంటూ ఆయన అధికార ప్రతినిది సురేష్ చంద్ర స్పందించారు.
సురేష్ చంద్ర ఆయన హెల్త్ అప్డేట్ గురించి చెబుతూ..'అజిత్ నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరం కొంచెం వాచింది. ఆ వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని సురేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని అన్నారు.
ఇక బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం అజిత్ ఆరోగ్యంగానే ఉన్నారు. స్వయంగా ఆయనే నడుస్తున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.
ALSO READ :-కానిస్టేబుల్ అభ్యర్థులు ఫేక్ బోనఫైడ్స్ అధికారుల రివెరిఫికేషన్
ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి అనే సినిమా చేస్తోన్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.. ఇప్పుడు కొన్ని నెలలు గ్యాప్ తీసుకోబోతున్నాడని సమాచారం..
Thala is well . Don’t worry guys 🙏 great human being #Ajithkumar
— RK SURESH (@studio9_suresh) March 8, 2024