నేను కేంద్ర మంత్రిగానే ఉంటా.. రాజీనామా చేయటం లేదు : సురేష్ గోపి

నేను కేంద్ర మంత్రిగానే ఉంటా.. రాజీనామా చేయటం లేదు : సురేష్ గోపి

కొన్ని మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు కేంద్రమంత్రి బీజేపీ ఎంపీ సురేశ్ గోపి.  కేంద్రమంత్రివర్గం నుంచి తాను రిజైన్ చేస్తారంటూ వస్తున్న వార్తలను తప్పు బట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలో  కేరళ అభివృద్ధి చేసేందుకు తాము కలిసి కట్టుగా ఉన్నామని ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ ఎంపీగా గెలుపొందారు. దీంతో తొలిసారి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 ‘కొన్ని మీడియా సంస్థలు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ తప్పుడు వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. అది పూర్తిగా అబద్ధం. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాము కృతనిశ్చయంతో ఉన్నాం’ అని సురేష్ గోపి తన పోస్టులో తెలిపారు.  

కాగా కేరళ నుంచి బీజేపీ తొలి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సురేష్ గోపీ త్రిస్సూర్‌లో 74 వేల ఓట్లతో విజయం సాధించారు.  లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యే ముందు సురేష్ గోపీ 2022 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర మంత్రిగా సురేష్ గోపి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ( జూన్​ 9)న ప్రమాణ స్వీకారం చేశారు.  ఎన్డీయేలోని మిత్ర పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు దక్కాయి.  కేంద్ర  మంత్రుల్లో 43 మంది పార్లమెంట్‌లో మూడు పర్యాయాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారు కాగా, 39 మంది ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మంత్రి మండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీ