వర్ని, వెలుగు: జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సురేశ్ షెట్కర్‌ను హైకమాండ్ డిక్లేర్చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ లీడర్లు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు తోట అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో శెట్కర్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తిరిగి గెలిపిస్తోందన్నారు. పార్లమెంట్పరిధిలోని లింగాయత్ సామాజికవర్గంతో పాటు అన్నీ వర్గాల ప్రజలు కాంగ్రెస్పక్షాన నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ వైస్ ప్రెసిడెంట్ నగేశ్, లీడర్లు అడప సాయిలు, షేక్ గౌస్, కర్కె అశోక్, నిస్సార్, మాశెట్టి శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు.