
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూర్ బీఆర్ఎస్అభ్యర్థి బాల్క సుమన్ గూండాలతో బెదిరిస్తున్నాడని ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుమన్ చదివిన ఓయూ నుంచే తాను కూడా ఉద్యమం చేశానన్నారు. అతడి లెక్క తన మీద కూడా వంద కేసులు నమోదయ్యాయని, కానీ వేయి కోట్లు మాత్రం లేవన్నారు.
కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడన్నారు. సుమన్ నకిలీ లిక్కర్ తో యువతను మద్యానికి బానిసలుగా మార్చుతున్నాడని ఫైర్అయ్యారు. ఈసారి కారుకు పంక్చర్ చేయకుంటే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఆగమవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ను ఓడిస్తే.. నిరుద్యోగ యువత కాళ్లు కడిగి నెత్తిన జల్లుకుంటానన్నారు.