మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఏళ్ళక్క పేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన ఏడుగురు మహిళలకు, ఒక వ్యక్తికి డాక్టర్లు సర్జరీ చేశారు. అయితే అనస్తీషియా ఇచ్చిన తరువాత... మత్తు ఎక్కక ముందే ఆపరేషన్ చేశారని బాధితులు అంటున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పొస్తుందని, మత్తు ఎక్కలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆపరేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
For More News..