డిఫెన్స్ కు అరకొరగా బడ్జెట్ కేటాయింపులు

ప్రపంచంలోనే ఎక్కువ సైనిక బలం ఉన్న దేశాల్లో ఇండియా రెండోది. అయితే బడ్జెట్ కేటాయిం పుల్లో మాత్రం ఆరో స్థానం. చైనా, రష్యా, సౌదీ అరేబియా దేశాలు మనకంటే రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాయి. డిఫెన్స్ కు మనం కేటాయిస్తోంది అరకొర కేటాయింపులే. అంతేకాదు ఆధునీకరణకు చేస్తున్న ఖర్చు కూడా తగ్గు తోంది.

2015–16 లో ఆధునీకరణకు రూ. 70.414 కోట్లు కేటాయిస్తే 2016–17 నాటికి అది 0.9 శాతం తగ్గింది. రూ. 69.783 కోట్లకు పడిపోయిం ది. ఒక్క ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణకు మాత్రమే నిధుల శాతం 12.1 కు పెరిగింది. ఆధునీకరణకు మరో రూ. 8,590 కోట్లు అవసరం ప్రస్తుత కేటాయిం పులతో పోలిస్తే డిఫెన్స్ సెక్టార్ ఆధునీకరణకు మరో 12 శాతం అంటే రూ. 8,590 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.

బడ్జెట్ లో ఎక్కువ శాతం నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే కేటాయిస్తున్నారు . దీంతో మోడర్న్ టెక్నాలజీ తో ఉన్న ఆయుధాలు కొనడానికి నిధుల కొరత ఎదురవుతోంది. పొరుగు దేశాలతో పోల్చుకుంటే జీడీపీ లో డిఫెన్స్ కు మనం కేటాయిస్తోంది 1.6 శాతం మాత్రమే. పాకిస్థా న్ 2.36 శాతం, చైనా 2.1 శాతం కేటాయిస్తున్నా యి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఏడాదికేడాది ప్రభుత్వ ఖర్చులో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించే పెరుగ దల శాతం తగ్గిపోతోంది. కిందటేడాది లెక్కల ప్రకారం మన ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 32 స్క్వాడ్రన్ లు ఉన్నాయి.

వీటిలో కాలం చెల్లిన మిగ్ –21 లను పక్కన పెట్టాల్సిన  మయం వచ్చిం ది. మిగ్ –21 విమానాలు గాల్లోకి ఎగరగానే కూలిపోవడం ఈమధ్య ఎక్కువైంది. అత్యాధునికమైన ఆయుధాలను అమ్ముల పొదిలో పెట్టుకోవడానికి చిన్న చిన్న దేశాలు కూడా ఉత్సాహ పడుతున్నాయి. ఎఫ్ –16, ఎఫ్ –35 తో పాటు మరికొన్ని ఆధునిక యుద్ధ విమానాల వైపు మొగ్గు చూపుతున్నా యి. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ ఫాలో కావాలి రక్షణ రంగంలో మరిన్ని పరిశోధనా అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాల్సి న అవసరం ఉంది.

దీనివల్ల దేశీయంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ ను ఇక్కడ ఫాలో అవ్వాలి. ఇప్పటికైతే రక్షణ బలగాల ఆయుధాల్లో మన దేశంలో తయారయ్యేవి కేవలం 40 శాతం వరకే ఉన్నాయి. వీటిని మరిం తగా పెం చాల్సి న అవసరం ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన డెలివరీలు ఆలస్యం కావడం, అగ్రిమెంట్లలో జాప్యం కారణంగా నిధులు మిగిలిపోయిన  సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి చెక్ పెట్టడానికి కొనుగోళ్ల ప్రక్రియను సింప్లిఫై చేయాల్సి న అవసరం ఉంది. డిఫెన్స్ సెక్టార్ కు సంబంధించి ‘ నాన్ లాప్సబుల్ ఫండ్ ’ ను ఏర్పాటు చేయాలని గతంలో పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రభుత్వం ఈ సూచనను పరిశీలిం చాలి. దేశ భద్రతకు సంబంధించి న కీలక విషయాల్లో రక్షణ రంగ నిపుణుల పార్టిసిపేషన్ తగ్గ తోందనే విమర్శలు కూడా వస్తున్నా యి. ఏమైనా దేశ భద్రత అనేది కీలకాం శం. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. రక్షణ శాఖ అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ లో కేటాయిం పులు చేయాల్సిన బాధ్యతు ప్రభుత్వాలపై ఉంది.