ఈ ఫైటర్లు చాలవు

ఈ ఫైటర్లు చాలవు

సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న ప్రస్తుత వాతావరణంలో మన సైనికుల పరిస్థితి చూస్తే నాకు ఆందోళన కలుగుతోంది. మన జవాన్ల దగ్గర అత్యం త ఆయుధాల్లేవు. ఇప్పటికీ తాతల కాలంనాటి వెపన్స్ నే ఉపయోగిస్తున్నారు . సరిహద్దుల్లో పాకిస్థా న్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా వారిని నిలువరించడానికి అవసరమైన వ్యవస్థ మన దగ్గరలేదు. అది ఆయుధాలు కావచ్చు, మరోటి కావచ్చు. మన పైలట్ల వీరత్వం పై నాకెలాం టి అనుమానాలు లేవు. వాళ్లు డిసైడ్ అయితే  వార్ ఒన్ సైడే. కానీ మన దగ్గర శత్రు విమానాలను కొన్ని సెకన్లలో మట్టి కరిపించే జెట్ ఫైటర్లు లేవు. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ’ (ఐఏఎఫ్ ) కు ఇదో పెద్ద మైనస్ పాయింట్. పాకిస్థా న్ కు చెందిన ఎఫ్ –16 యుద్ధ విమానాన్ని మన ఎయిర్ ఫోర్స్ దళాలు కూల్చి నట్లు పేపర్లలో చదివా. అయినా నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. ఐఏఎఫ్ దగ్గర అంతటి పవర్ ఫుల్ జెట్ ఫైటర్స్ ఉన్నా యా అనేది నా అనుమానం. బుధవారం ఆకాశంలో జరిగిన హోరాహోరీ పోరాటంలో మన రెండు విమానాలను పాకిస్థా న్ కూల్చేసింది. విం గ్ కమాం డర్ అభినందన్ పాక్ సైన్యం చేతిలో బందీగా పట్టుబడటంతో దేశమంతా టెన్షన్ నెలకొంది. అభినందన్ కోసం ప్రజలు పూజలు చేశారు. చివరకు అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటిం చడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది.

దేశ భద్రతపై విజన్ ఏదీ ?

సైనికుల వీరత్వం గురించి మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా , దేశ భద్రతకు సంబంధించి లీడర్లకు ఒక విజన్ అంటూ లేకపోవడం దారుణం. ఇలాం టి విజన్ లేని నాయకుల వల్లనే ఈ పరిస్థితి దాపురిం చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదో చేదు వాస్తవం. డిఫెన్స్ వ్యవహారాలకు సంబంధించి విజన్ లేని నాయకులకు దేశాన్ని పాలిం చే అర్హత లేదన్నది నా వ్యక్తి గత అభిప్రాయం. దేశాన్ని నడిపించాల్సిన నాయకులు దేశ భద్రత, అభివృద్ది కంటే కుర్చీల కుమ్ములాటలకు ప్రయారిటీ ఇస్తున్నారు. దేశం కంటే వ్యక్తి గత అజెం డాలే టాప్ ప్రయారిటీలయ్యాయి. దీని కోసం ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటారు. అవసరమైతే అధికారం కోసం మళ్లీ కలిసిపోతారు. ఇదొక రొటీన్ వ్యవహారంగా మారిం ది. వాయుసేనలో మనమే పెద్ద ఫోర్స్ కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో మన వాయుసేనను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిర్ ఫోర్స్ లో ఇండియానే అతి పెద్ద ఫోర్స్ గా మారాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధునిక యుద్ద విమానాలు సరిపోవు. మరిన్ని జెట్ ఫైటర్ల అవసరం ఎంతైనా ఉంది. వీటిని పెద్ద ఎత్తున పోగేసుకోవాలి.

అవసరమైతే మోడర్న్ జెట్ ఫైటర్ల ను మన దేశంలోనే తయారు చేయడం మొదలెట్టాలి. ఇది ముహూర్తాలు చూసుకుని చేసే పని కాదు. రక్షణమంత్రిత్వ శాఖకు చెం దిన పై అధికారులు  వెంటనే రంగంలోకి దిగాలి. పక్కా ప్లాన్ తో ముం దుకు దూసుకెళ్లాలి. ప్రపంచంలోనే అత్యం త ఎక్కువ మంది సైనికులు మన దగ్గరే ఉన్నారు . మన ఆర్మీకి అది ప్లస్ పాయిం టే. కాదని ఎవరూ అనరు. అయితే జవాన్ల సంఖ్య చూసి సంబరపడితే సరిపోదు. రణరంగంలో ప్రాణాలు ఒడ్డి పోరాడే సైనికులే కాదు మోడర్న్ ఎక్విప్ మెంట్ కూడా మనకు అవసరమే. వ్యవస్థలోని లోపాలకు జవాన్ల ప్రాణాలను బలిచ్చే హక్కు మన పాలకులకు లేదు. సాదా సీదా సైనికుడిని చిన్న చూపు చూసే రోజులు పోయాయి. సైనికుడు లేనిదే అసలు దేశమే లేదనే రోజులు వచ్చాయి. ఓ ప్రభుత్వాధి నేత ఎంత ముఖ్యమో ప్రతి జవానూ అంతే ముఖ్యం . శత్రుదేశాలు మన వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే ముందుగా ఆర్మీని మరిం త శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మోడర్న్ జెట్ ఫైటర్లు, మిసైళ్లు, ట్యాంకు లతో పాటు యుద్ధానికి అవసరమయ్యే సమస్త సరంజామాను ఇండియా సమకూర్చుకోవాలి. అప్పుడే భద్రత పరంగా మనం ‘సేఫ్ జోన్ ’ లో ఉన్నట్లు. అమర జవాన్లకు సెల్యూట్ దేశ రక్షణ కోసం ప్రాణాలు బలిచ్చిన అమర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా . వారి త్యాగాలు వృథా కారాదు. మరో ఇండియాను మనం రూపొందించుకోవాలి. అందులో ఢిల్లీ పొలిటీషియన్ల కంటే కాశ్మీర్ లో కాపలా కాసే సైనికులకు టాప్ ప్రయారిటీ ఉండాలి. పవర్ ఫుల్ మిలటరీ ఉండాలి. శత్రువు ఇండియా వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి. జై హింద్

– విజయకృష్ణ చాట