
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ‘రెట్రో’ మూవీ సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. రెట్రో సినిమా 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్ లాక్ చేసుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన గత సినిమాల మాదిరిగానే రెట్రో రన్ టైం ఉంది.
పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాలన్నీ 2 గంటలా 40 నిమిషాలనే రన్‌టైమ్‌తో వచ్చాయి. ఇప్పుడు ‘రెట్రో’కూడా అలానే వస్తుండటం విశేషం. ఇదొక పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ మూవీ. ఇందులో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు.
1980ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించినట్లు టాక్. ఈ సినిమా చివరి 15 నిమిషాలు సూర్య అసామాన్యమైన నటనను చూడబోతున్నట్లు సమాచారం. దానికితోడు కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ మార్క్, టేకింగ్, సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవ్వనున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, కంగువ సినిమాతో భారీ డిజాస్టర్ సొంతం చేసుకున్న సూర్య.. రెట్రో మూవీతో సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే, రెట్రో నుంచి వచ్చిన టీజర్ వీపరీతమైన ఇంపాక్ట్ కలిగించింది. దాంతో ఈ సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన, తెలుగు మార్కెట్ కుదేల్ అవ్వాల్సిందే. ఎందుకంటే, హీరో సూర్య నటించిన తెలుగు డబ్బింగ్ తమిళ సినిమాలు ఒరిజినల్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు చేశాయి. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించనుందో చూడాలి.
►ALSO READ | JAAT Box Office: వసూళ్లతో దుమ్ములేపుతున్న జాట్.. అక్కడ గోపీచంద్ మలినేని గట్టిగా పాతేశాడు
ఇకపోతే, రెట్రో మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రీబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, శ్రేయాస్ కృష్ణ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటర్. 2D ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై జ్యోతిక సూర్య కలసి నిర్మించారు.
'U/A' సర్టిఫికేట్:
ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.