కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ తెరకెక్కించినచిత్రం ‘కంగువ’(Kanguva). కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ నేడు నవంబర్ 14న రిలీజై ఫస్ట్ షో ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సూర్య వన్ మెన్ షోగా కంగువ మూవీ నిలుస్తుందని.. కంగువ క్యారెక్టర్‌లో సూర్య ఎంట్రీ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని.. కంగువ వరల్డ్‌లో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారనే టాక్ వస్తోంది.
ఈ నేపథ్యంలో కంగువ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. డిజిటల్ ప్లాట్ఫామ్పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కంగువ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. స్ట్రీమింగ్ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Also Read : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ
అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ మాత్రం కామన్ గా రిలీజై తమిళ మూవీస్ లాగ కాకుండా కాస్తా లేట్గా స్ట్రీమ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారట. అంటే, సాధారణంగా తమిళ సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంటాయి. కానీ, 350 కోట్లకి పైగా బడ్జెట్‌తో వచ్చిన కంగువ మాత్రం మరో రెండు వారాలు ఆలస్యంగా.. అంటే 6 వారాలకు స్ట్రీమ్ అయ్యేలా డీల్ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని బట్టి చూస్తే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న కంగువ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.