
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్. తమ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు (మే1న) పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది.
అయితే, ఈ సినిమా నుంచి తెలుగులో అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వట్లేదు. రేపు స్టార్ హీరో నాని హిట్ 3 మూవీ కూడా రిలీజ్ అవుతుండటంతో తెలుగు ఆడియన్స్ రెట్రోని పెద్దగా పట్టించుకోట్లేదని వినిపిస్తోంది. కానీ, తమిళనాడు అంతటా భారీ స్పందన వస్తోంది. అందుకు తగ్గట్టుగానే టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఏప్రిల్ 27, 2025న సాయంత్రం 5 గంటల నుంచే బుకింగ్స్ ఊపందుకున్నాయి. తమిళనాడు అంతటా BookMyShow లో కేవలం 24 గంటల్లోనే 83,640 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.8.8 కోట్లను కోట్లకి పైగా వసూళ్లు చేసింది. ఓవర్సీస్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, రెట్రోకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు, తెలుగు ప్రేక్షకులు సూర్యకు బ్రహ్మరథం పట్టె ఛాన్స్ ఉంది.
రెట్రో బడ్జెట్:
రెట్రో మూవీని సూర్య, జ్యోతిక హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి ప్రమోషన్స్, రెమ్యునరేషన్స్తో కలిపి సుమారుగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం.
అదే మాదిరిగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. ఈ సినిమా తమిళ థియేట్రికల్ బిజినెస్..అక్కడీ ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ టౌన్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మకాలతోనే సగానికి పైగా బడ్జెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే..
రెట్రో వరల్డ్ వైడ్ బిజినెస్:
తమిళనాడు- రూ.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- రూ.9.50 కోట్లు
కర్ణాటక- రూ.8 కోట్లు
Ke+ROI- రూ.5 కోట్లు
విదేశాలు- రూ.18 కోట్లు
మొత్తం WW బిజినెస్-రూ. 80.50 కోట్లు
(బ్రేక్ ఈవెన్ – 82 కోట్లు~ స్థూల)
ఇలా చూసుకుంటే.. రెట్రో మూవీ తెలుగునాట క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.10.50 కోట్ల రేంజ్లో షేర్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.150కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు దక్కించుకోవాలి. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు.. రెట్రో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడానికి!
అయితే, సూర్య కంగువ మూవీతో భారీ డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి వరల్డ్ వైడ్గా రూ.105-130 కోట్ల లోపే గ్రాస్ వచ్చింది. అంటే, ఈ లెక్కని బట్టి చూస్తే.. తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా కంగువ నిలిచింది. అందువల్ల సూర్య ఈ సారి రెట్రో మూవీతో గట్టిగా కొట్టేయాలి. లేదంటే అంతే సంగతి.
‘రెట్రో’సెన్సార్:
‘రెట్రో’మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A)సర్టిఫికెట్ జారీ చేసింది. రెట్రో సినిమా 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్ లాక్ చేసుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన గత సినిమాల మాదిరిగానే రెట్రో రన్ టైం ఉంది. పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాలన్నీ 2 గంటలా 40 నిమిషాలనే రన్‌టైమ్‌తో వచ్చాయి. ఇప్పుడు ‘రెట్రో’కూడా అలానే వస్తుండటం విశేషం.
The world of the One just got real and absolute #Retro❤️🔥
— 2D Entertainment (@2D_ENTPVTLTD) April 17, 2025
Censored U/A with a strong dose of #LoveLaughterWar
Audio and Trailer from tomorrow 💥#RetroFromMay1@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/1nokyVx1kt