
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ (Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ముంబైలో ఈవెంట్ కంప్లీట్ అవ్వగానే.. న్యూ ఢిల్లీలో ఫ్యాన్స్ తో సూర్య సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కాలేజ్ గ్రౌండ్‌కు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భాగంగా సూర్య మాట్లాడి స్టూడెంట్స్ లో జోష్ పెంచారు.
Also Read : అరాచకాలను అణచే రాక్షసుడు
సూర్య తన అభిమానులకు,స్టూడెంట్స్ కు జీవిత లక్ష్యాలను సాధించడానికి.. ఎల్లప్పుడూ తమ కుటుంబం, స్నేహితులు యొక్క వశ్వాసాన్ని విశ్వసించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో బ్యూటీ డిశాపటానీ, బాబీ డియోల్ స్టేజీపై నుంచి అభిమానులతో కలిసి సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
More from #Kanguva’s Delhi promotional event 😍 And stay tuned for a whole lot more of celebrations #KanguvaFromNov14 🦅@Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP @StudioGreen2 @gnanavelraja007 @vetrivisuals @supremesundar @UV_Creations @KvnProductions… pic.twitter.com/7MfLyGqLgi
— UV Creations (@UV_Creations) October 22, 2024
ఇకపోతే.. 'కంగువ' ఢిల్లీ ప్రమోషన్‌లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ చూస్తుంటే.. ఉత్తర భారతదేశంలో సూర్య అభిమానుల శక్తి ఏంటనేది రుజువు చేస్తుంది. ఈ సినిమాలో దిశ పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.