
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ క్రమంలో రెట్రో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా రానుంది. ఇందులో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించాడు.ఈ యాక్షన్ లవ్ స్టోరీలో సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించాడు. లవ్ సీన్స్‌తో పాటు మాస్, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ కట్ చేశారు.
కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్లో ట్రైలర్ కూడా చాలా ఫాస్ట్ గా, ఫుల్ యాక్షన్ తో సాగిపోయింది. సూర్య డిఫరెంట్ గెటప్స్, లుక్స్ లో ట్రైలర్ మొత్తం సందడి చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ట్రైలర్ కార్తీక్ సుబ్బరాజ్- సూర్య ఇద్దరి సంతకాల సంభవం. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ప్రేక్షకులను వింటేజ్ కాలానికి తీసుకెళ్తుంది. సూర్య పాత్ర హింస నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిగా కనిపించేలా ఉంటుంది.
"వేచి ఉండే ప్రేమ, వికలాంగులను చేసే నవ్వు మరియు విముక్తి కలిగించే యుద్ధం" అని క్యాప్షన్తో మేకర్స్ ఇంపాక్ట్ చూపించేలా చేశారు. ఇచ్చారు. సంతోష్ నారాయణన్ కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రెట్రో ట్రైలర్ ను పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. సూర్యతో పాటు పూజా హెగ్డే, జయరామ్, ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ పాత్రలను సరిగ్గా వాడుకున్నట్లుగా ఉంది.
సూర్య పాత్ర తన ప్రేమికురాలు పూజా హెగ్డే పోషించిన పాత్రకు భిన్నంగా ఉంది. గ్యాంగ్‌స్టర్ అయిన సూర్య.. గొడవలు, పంచాయితీలు, రక్తపాతాలు, రౌడీయిజాలు ఈ క్షణం నుంచి వదిలేస్తాను అని తన లవర్ పూజాహెగ్డేకు మాట ఇస్తాడు. మరోసారి వీరిద్దరూ మళ్ళీ కలిసినప్పుడు, అతను అదే మార్గంలో మరింత ముందుకు వెళ్తాడని చూపిస్తోంది.
కానీ అతని గతం అంత ఈజీగా అతన్ని వదిలేస్తుందా.. రౌడీయిజం నుంచి అతను బయటపడగలిగాడా అనే అంశాలతో దీన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. "గత సంవత్సరాలలో మనం విడిపోయిన జీవితాలు ఆమెను బుద్ధుడిగా మరియు నన్ను రాక్షసుడిగా మార్చాయి." అనే డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. మే 1న సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ల థ్రిల్లర్ సంభవంలా రెట్రో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
‘రెట్రో’ సెన్సార్:
ఈ క్రమంలో ‘రెట్రో’ మూవీ సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. రెట్రో సినిమా 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్ లాక్ చేసుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన గత సినిమాల మాదిరిగానే రెట్రో రన్ టైం ఉంది.
The world of the One just got real and absolute #Retro❤️🔥
— 2D Entertainment (@2D_ENTPVTLTD) April 17, 2025
Censored U/A with a strong dose of #LoveLaughterWar
Audio and Trailer from tomorrow 💥#RetroFromMay1@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/1nokyVx1kt
పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాలన్నీ 2 గంటలా 40 నిమిషాలనే రన్‌టైమ్‌తో వచ్చాయి. ఇప్పుడు ‘రెట్రో’కూడా అలానే వస్తుండటం విశేషం. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ నిర్మించాయి.