ఇండియా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందనుకున్న సూర్య కంగువ మూవీ డే 1 (నవంబర్ 14) కలెక్షన్స్ చూస్తే షాక్ అవుతారు. కంగువ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్ల నెట్, రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక ఇండియా లో స్టేట్స్ వైడ్గా చూసుకుంటే.. అత్యధికంగా తమిళ వెర్షన్ రూ.13 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు రూ. 6 కోట్లు, హిందీలో రూ.3.25 కోట్లకుపైగా ఈ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ నిపుణుల లెక్కల చెబుతోన్నాయి.
ఇకపోతే కేరళ, కర్ణాటకలో కంగువ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. అయితే, ఇక్కడ సూర్య భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసినప్పటికీ.. ఆడియన్స్ ఈ మూవీని సొంతం చేసుకోలేకపోయారు. అయితే, మన తెలుగులో రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కంగువ రిలీజైంది. అయినప్పటీకీ కేవలం రూ.6 కోట్లు చేయడం షాక్ కలిగిస్తోంది.
Also Read : నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు లేడు
ఎందుకంటే, హీరో సూర్యకి టాలీవుడ్ లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయినా, ఇలాంటి కలెక్షన్స్ రావడం పట్ల సూర్య ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. మరి ఈ వీకెండ్ ఎంత వసూళ్లు చేస్తుందనే అంశం పట్ల కంగువ వార్.. సక్సెస్, డిజాస్టర్ హా అనేది తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాలో వెయేళ్ల నాటి కథ తీసుకున్నప్పటికీ.. అందులో ఐదు వంశాలు చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో కన్‌ప్యూజ్ పెరిగిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాగర కోన, అరణ్యకోన, ప్రణవకోన, కపాల కోన, హిమ కోన వంశాలను సినిమాలో చూపించారు.