కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే కంగువ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ పలు నెగిటివ్ రివ్యూస్ కారణంగా ఆడియన్స్ ని అలరించడంలో విఫలమైంది. దీంతో ఈసారి హీరో సూర్య మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తన్నాడు. కాగా ఆమధ్య ఈ సూర్య 44 సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుధవారం క్రిస్మస్ పండగ సందర్భంగా సూర్య తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.
అయితే సూర్య ప్రస్తుతం తమిళ్ లో ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రెట్రో(RETRO) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు రెట్రో సినిమా తమిళ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సూర్యకి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నటించింది. ఈ టీజర్ లో పూజ హెగ్డే ఎలాంటి గ్లామర్ పాత్రలో కాకుండా చీర సాంప్రదాయ దుస్తుల్లో హోమ్లీ గ కనిపించింది. ఇక హీరో సూర్య మాత్రం మందు గ్లాస్ తో రెబల్ లుక్ లో కనిపించాడు.
ఈ సినిమా క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 2D ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక సూర్య కలసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. రెట్రో సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.