KanguvaTrailer: సూర్య Vs బాబీ డియోల్..ఇండియన్‌ స్క్రీన్‌ దద్దరిల్లాల్సిందే

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya)..ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది.ఈ ట్రైలర్ లో విజువల్స్, నటి నటుల మైండ్ బ్లాంక్ చేసే లుక్స్ ,సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ అని చెప్పాలి. ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట, భీకరమైన యుద్ధం, సూర్య వాయిస్..ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవల్ అనే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం అనేలా ఉంది. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం కన్ఫమ్. 

ఇక ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుండగా..దీనికి రెండు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం, సూర్య విశ్వరూపం చూపించడం ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.