Suriya44: క్రేజీ కాంబో.. కార్తీక్ సుబ్బరాజు-సూర్య‌ మూవీ అప్డేట్

Suriya44: క్రేజీ కాంబో.. కార్తీక్ సుబ్బరాజు-సూర్య‌ మూవీ అప్డేట్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు. సూర్య 44 టైటిల్‌గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే జిగర్ తండా డ‌బుల్ ఎక్స్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) సూర్య 44ని జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇవ్వగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు పోస్ట్ చేసిన మరో అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. 

ఈ సందర్బంగా హీరో సూర్య ట్విట్టర్ X ద్వారా సూర్య 44 టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఎన్నో లొకేషన్లలో సూర్య 44 షూటింగ్‌ చేశాం. చిత్రీకరణంతా చాలా ఆనందంగా జరిగింది. ఈ సినిమా కోసం ఎంతోమంది టాలెంటెడ్‌ వ్యక్తులు పని చేశారు. డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజు నాకు సోదరుడితో సమానం. అతడి దర్శకత్వంలో వర్క్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను ఈ టీమ్‌ నాకు అందించింది’ అంటూ చిత్ర బృందానికి సూర్య కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ | SinghamAgainTrailer: సింగం ఎగైన్ ట్రైలర్ రిలీజ్.. అజయ్‌ దేవగన్- అక్షయ్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ అదిరింది

‘సినిమాపై మీకున్న అంకితభావం, నిబద్ధత వల్లే షూటింగ్‌ ఇంత తర్వగా పూర్తిచేయగలిగాం’ అంటూ సూర్యకు డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజు రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం వీరిద్దరి సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండటంతో.. 'ఇంత ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేయగలిగారు సార్.. మీ అద్భుతమైన కాంబో కోసం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నాం' అంటూ సినీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

కాగా సూర్య 44 డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.. ఎవ‌రో కాదు ఇటీవలే జిగర్ తండా డ‌బుల్ ఎక్స్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అంతేకాదు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా కథారచయిత కూడా ఇతనే. ఇక ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్,స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఆసక్తి రేపాడు డైరెక్టర్. ఈ కింద ఉన్న పోస్టర్ గమనిస్తే 'దట్టమైన అడవి చుట్టూరా కార్చిచ్చు..ఒక కారు..పెద్ద చెట్టుపై బాణం..దాని అడుగుభాగాన లవ్..లాఫర్..వార్' అంటూ రాసి ఉంది. ఇది చాలు కదా సూర్య మూవీ అంటే! ఇక వచ్చేస్తోంది రెడీగా ఉండండి.