
తూప్రాన్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం తూప్రాన్ లోని 50 పడకల ఆసుపత్రిని, ఆయుర్వేదిక్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గవర్నమెంట్ హాస్పటల్ లో డాక్టర్లందరూ పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రసవాల కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాలకు అనవసరంగా రిఫర్ చేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. .