- ప్లాటూన్ సెక్షన్ డిప్యూటీ కమాండర్ సోడె హుర్రాకు రూ. 25 వేల తక్షణసాయం
భద్రాచలం, వెలుగు : చత్తీస్గడ్ లోని బీజాపూర్జిల్లా గంగులూరు ఏరియా కమిటీ ప్లాటూన్ –12 సెక్షన్డిప్యూటీ కమాండర్సోడె హుర్రా పోలీసులకు లొంగిపోయారు. బుధవారం దంతెవాడ డీఆర్జీ ఆఫీసులో లొంగిపోగా.. అతనిపై రూ.3లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు లోన్వరాట్పేరిట చత్తీస్గడ్సర్కార్ప్రోత్సాహకం అందిస్తుండగా.. హుర్రాకు రూ.25వేలు తక్షణ సాయం కింద ఇచ్చారు.
అదేవిధంగా ప్రతి నెల రూ.10వేల సాయం కూడా మూడేండ్ల పాటు ఇవ్వనున్నారు. ట్రైనింగ్ఇచ్చి స్వయం ఉపాధి కూడా కల్పించనున్నారు. ఈ పథకాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంతి విజయ్‌శర్మ ఇటీవలే ప్రారంభించగా.. అందుకుంటున్న తొలి మావోయిస్టు సోడె హుర్రా కావడం విశేషం.