మూగజీవాల అక్రమ రవాణాపై నిఘా

మూగజీవాల అక్రమ రవాణాపై నిఘా

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమంగా మూగజీవాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీస్  కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే డయల్ 100, కంట్రోల్ రూమ్  63039 23200 కు సమాచారం అందించాలన్నారు.

అక్రమ రవాణాను అడ్డుకొని గొడవలు సృష్టిస్తే వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్  పండుగ సందర్భంగా అక్రమంగా పశువులను రవాణా చేసే అవకాశం ఉన్నందున, పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో జిల్లాలో మూడు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అక్రమ తరలింపును అడ్డుకుంటామని చెప్పారు. జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్ధారం గండి, పెద్దమందడి మండలం మోజర్ల దగ్గర, పెబ్బేరు బైపాస్  దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.