హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదే శించారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు ప్రవే శించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, సౌత్ బస్తర్‌లో పోయిన నెల 26న జరిగిన పేలుడు నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సరిహద్దు జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలకు డీజీపీ కీలక సూచనలు చేశారు. దాడులు జరిగితే రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రముఖుల పర్యటనలు పెరుగుతున్నాయన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలిపా రు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ పోలీసులు తమ వ్యూహాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎస్ఐబీ సేవలు బాగున్నయ్
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మంచి ఫలితాలు ఇస్తున్నదని అంజనీకుమార్ అన్నారు. రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచడంతో పాటు అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల హింసను అడ్డుకుంటున్నదని తెలిపారు. ఎస్‌ఐబీ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల కదలికల్లో మార్పులు, వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని అడిషనల్ డీజీ విజయ్ కుమార్ అన్నారు. వీఐపీల వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో తీవ్రవాద పరిస్థితులు, పోలీసులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో లా అండ్ ఆర్డర్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీంలు తదితరులు పాల్గొన్నారు.