తుర్కయాంజల్ మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణకు సర్వే

తుర్కయాంజల్ మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణకు సర్వే

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణకు సోమవారం రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేపట్టారు. సాగర్ రహదారి నుంచి తొర్రూర్ స్కూప్స్ ఐస్​క్రీమ్ కంపెనీ వరకు 60 ఫీట్ల రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి గుడి కమాన్ నుంచి సాయిప్రియ లేఅవుట్​లోని హైటెన్షన్ లైన్ కింది నుంచి రోడ్డు వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం స్థానికంగా ఇళ్లు కట్టుకొని, నివాసం ఉంటున్నవారిలో గుబులు రేపుతోంది.  

సాయిప్రియ లేఅవుట్ తర్వాత వ్యవసాయ భూములు, ఒపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటికి పరిహారం చెల్లిస్తేనే ఆడుగు ముందుకు పడనుంది. బీఆర్ఎస్ హయాంలో అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఇళ్లు, ప్లాట్లు, రైతుల పొలాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆర్డీవో అనంత్ రెడ్డి తెలిపారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, హెచ్ఎండీఏ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శైలజ, సర్వేయర్ జ్యోతి తదితరులున్నారు.