
- ఫస్ట్ టైం డైట్ స్టూడెంట్స్‌తో థర్డ్ పార్టీ పరిశీలన
కామారెడ్డి, వెలుగు : గవర్నమెంట్ స్కూల్స్ స్థితిగతులపై సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు యూడైస్ వివరాలపై ఈసారి ప్రభుత్వం థర్ట్ పార్టీ సర్వే చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో 890 స్కూల్స్‌లో కంప్లీట్ కాగా, వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఆయా స్కూల్స్ హెచ్ఎంలు, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గవర్నమెంట్ స్కూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను యూడైస్ (డిస్ర్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కంప్లీట్ చేస్తారు. ప్రైమరీ, యూపీఎస్, హైస్కూళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి.
స్కూళ్లలో మౌలిక వసతుల కొరత, బిల్డింగ్స్ స్థితిగతులు, క్లాస్ రూమ్స్ సరిపోతున్నాయా..? లేదా..? స్టూడెంట్స్ సంఖ్య, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నారా.. లేదా.., టాయిలెట్స్, గ్రౌండ్, యూనిఫామ్స్, కిచెన్ షెడ్డు, ర్యాంప్, కరెంట్ సౌకర్యం, వాటర్ సౌకర్యం తదితర వివరాలు ఇందులో ఎంట్రీ చేయాలి. ఈ వివరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆయా స్కూల్స్‌కు ఫండ్స్ కేటాయించనుంది.
89 మందితో సర్వే ..
గతంలో ఎన్నుడూ లేని విధంగా ప్రభుత్వం యూడైస్ పై థర్డ్ పార్టీ సర్వే చేయించింది. హెచ్ఎం, విద్యా శాఖ అధికారులు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా అని డైట్ కాలేజీ స్కూడెంట్లతో థర్డ్ పార్టీ ద్వారా మరో సర్వే చేయించింది. జిల్లాలో 89 మంది డైట్ విద్యార్థులు ఐదు రోజులపాటు 890 స్కూళ్లలో సర్వే చేపట్టి వివరాలను ఆన్లైన్ పొందుపర్చారు. ఇంతకు మందు హెచ్ఎంలు, అధికారులు యూ డైస్లో నమోదు చేసిన వివరాలు, థర్డ్ పార్టీ సర్వే వివరాలు స్కూళ్ల వారీగా అధికారులు పరిశీలిస్తారు. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే పరిశీలించి తదుపరి సమగ్ర వివరాలతో ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో ప్రధానంగా స్కూల్స్ బిల్డింగ్స్ శిథిలం కావటం, క్లాస్ రూమ్స్ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడం, టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి స్కూల్స్‌కు వచ్చే ఫండ్స్‌కు యూ డైస్ నివేదికలు కీలకం కానున్నాయి.