యాదాద్రి జిల్లాలో పోడు భూముల సర్వే పూర్తి

  • సాగులో లేకున్నా భూమి వస్తదన్న ఆశతో అప్లై చేసుకున్న వ్యక్తులు
  • 6,133 ఎకరాలకు 2,130 అప్లికేషన్లు
  • 60 శాతం మంది అనర్హులేనని సమాచారం
  • 2 వేల ఎకరాలకు తేలని హద్దులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో పోడు భూముల సర్వే పూర్తైంది. డివిజన్ల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు గ్రామ సభల్లో అప్లికేషన్ల స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే పోడు సాగు చేయకున్నా భూమి వస్తదన్న ఆశతో అనర్హులే ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్లు తేలింది. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణపురం, చౌటుప్పల్, తుర్కపల్లి మండలాల్లో 6,133 ఎకరాల పోడు భూమి సాగులో ఉంది. ఈ భూమి కోసం 11 గ్రామాల్లో 2,130 మంది గిరిజన, గిరిజనేతరులు అప్లై చేసుకున్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8న ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియడంతో ఫారెస్ట్, పంచాయతీ, రెవెన్యూ ఆఫీసర్లు 20 టీంలుగా ఏర్పడి భూముల సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా 2005 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13 నాటికి ఎంత మేరకు పోడు సాగు చేస్తున్నారు ? భూ విస్తీర్ణం ఎంత ? నాలుగు వైపులా ఎవరెవరు ఉన్నారన్న వివరాలను తెలుసుకున్నారు. జిల్లా ఆఫీసర్ల ఆదేశాల మేరకు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 లోపు సర్వేతో పాటు గ్రామసభలు, డివిజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తి కావాల్సి ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాసరావు హత్యతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో సర్వే, యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివరాల అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పూర్తైంది. కానీ సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నారాయణపురం మండలంలోని పలు తండాల్లో రెవెన్యూ, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల హద్దులు మాత్రం తేలలేదు.

60 శాతం అనర్హులే ?

పోడు భూముల కోసం అప్లై చేసుకున్న వాళ్లలో 60 శాతం మంది అనర్హులేనని తెలుస్తోంది. భువనగిరి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తుర్కపల్లి, చౌటుప్పల్ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
నారాయణపురం మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 6,133 ఎకరాల కోసం 2,130 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్​లోని 10 గ్రామాలకు చెందిన 2,016 మంది 6,106.45 ఎకరాలకు అప్లై చేసుకున్నారు. సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణపురం మండలంలోని ఎంకంబావితండాకు సంబంధించిన ప్రభుత్వ భూమిని 2006–-07లో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేశారు. అయితే ఈ భూమిని కూడా పోడు చేసినట్లుగా కొందరు అప్లై చేసుకున్నారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని ఎల్లంబావి తండాలో కూడా అనర్హులు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. సర్వే అనంతరం గ్రామసభలు, డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించి అప్లికేషన్ల స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎప్పుడూ గుంట భూమి సాగు చేయని వాళ్లు, 2005లో పుట్టిన వాళ్లు సైతం భూమి వస్తుందన్న ఆశతో అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అప్లికేషన్ల వారీగా తీర్మానం

పోడు భూములకు సంబంధించి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ముగియడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగాల్సి ఉంది. ఆ తర్వాత అర్హులుగా తేలిన వారి భూములపై తీర్మానం చేసి స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీకి పంపిస్తారు. ఒక్కో అర్హుడి భూమి వివరాలతో పాటు, 2005 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ముందున్న భూమికి సంబంధించిన శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోను అనుసంధానం చేయనున్నారు. అనర్హులుగా గుర్తించిన వారు మళ్లీ అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే వీరు 60 రోజుల్లోపు రీ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

రెవెన్యూ, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్డర్లు తేలలే...

సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నారాయణపురం మండలంలోని పలు తండాల్లో 2 వేల ఎకరాల భూమిపై రెవెన్యూ, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల మధ్య వివాదం నెలకొంది. రెవెన్యూ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమికి పట్టాలు ఇవ్వడంతో రెండు శాఖల మధ్య పంచాయతీ తెగడం లేదు. పంచాయతీకి ముగింపు పలకాలనుకున్న టైంలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగడంతో హద్దుల గొడవ అలాగే ఉండిపోయింది. 

సర్వే ముగిసింది

యాదాద్రి జిల్లాలో పోడు భూముల సర్వే ముగిసింది. గ్రామసభలు ముగియడంతో పాటు డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సైతం ముగిశాయి. త్వరలోనే డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. తర్వాత పూర్తి వివరాలను స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీకి పంపిస్తాం.
– మందడి ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి జిల్లా